మహబూబాబాద్ కలెక్టరేట్‌లో ఏసీబీ సోదాలు.. పౌరసరఫరా శాఖాధికారులే టార్గెట్
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:43 PM
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
మహబూబాబాద్, అక్టోబర్ 9: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పౌరసరఫరా శాఖ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రావు కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన కార్యాలయంతో పాటు.. మేనేజర్ నర్సింహారావు కార్యాలయంలోనూ, ఖమ్మంలోని తమ బినామీ నివాసంలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులను కూడగట్టినట్లు వచ్చిన ఆరోపణల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తనిఖీల అనంతరం వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.
లంచం అడిగితే 1064కు కాల్ చేయండి: ఏసీబీ డీఎస్పీ రమేశ్
‘మహబూబాబాద్ కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి నరసింహారావు నివాసంలో సోదాలు చేస్తున్నాం. ఇప్పటివరకు15ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఆయన రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. నరసింహారావు పనిచేసిన అన్నీ ప్రాంతాల్లోనూ ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నరసింహారావు ఆఫీసులోనూ, ఆయన నివాసంలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా నివాసముంటున్న ఆయన బంధువులు, బినామీల ఇళ్ళల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు కొనసాగిన సోదాల్లో.. ఆయనకు ఖమ్మంలో 2 విలాసవంతమైన భవనాలు, హైదరాబాద్‌లో పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించాం. ఆయన దగ్గర నుంచి 4 మద్యం బాటిల్స్, 19 వేల నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం. అన్నీ ప్రాంతాల్లో సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేస్తాం’ అని డీఎస్పీ రమేశ్ తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమికి నకిలీ ఫర్మానా.. 10 మంది అరెస్ట్
‘సర్’పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేటీఆర్
Read Latest AP News And Telugu News