Share News

తొలకరికే తొందరొద్దు!

ABN , Publish Date - Jun 06 , 2026 | 01:03 PM

ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

తొలకరికే తొందరొద్దు!
Agriculture

  • పంట ఎంపికలో అప్రమత్తత అవసరం

  • ‘ఎల్‌నినో’ ప్రభావంతో వానలు తగ్గే అవకాశం

  • పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు

  • రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

రాయపోల్‌(రంగారెడ్డి): ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తొలి వర్షాలకే విత్తనాలు వేయకుండా, భూమిలోని వేడి తగ్గి 60 నుంచి 75 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేయడం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని త్వరగా దిగుబడులు వచ్చే రకాలు, తక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.


పంట మార్పిడి, సేంద్రీయ ఎరువుల వినియోగం, వరికొయ్యలు కాల్చడం వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన పెంచుతున్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ఆరుతడి, నీటి ఆధారిత పంటలను సమతుల్యంగా సాగుచేయడం ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉపయుక్తంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. బోరునీటి వసతి ఉన్న రైతులు నీటి లభ్యతను బట్టి మొక్కజొన్న, వరి సాగు చేయ్సాల్సి ఉంటుంది. వరిసాగులో స్వల్పకాలిక వంగడాలను సాగుచేయడం ద్వారా ప్రమాదాలను కొంతవరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.


AAAA.jpgరాయపోల్‌ మండలంలో గత వానాకాలంలో 10,249ఎకరాల్లో వరి, 1,045 ఎకరాల్లో మొక్కజొన్న, 6,500 ఎకరాల్లో పత్తిసాగు కాగా, ఈ ఏడాది వరి విస్తీర్ణం 7,800 ఎకరాలు, మొక్కజొన్న 2,550 ఎకరాలు, పత్తి 7వేల ఎకరాలు పప్పుధాన్యాలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలి

వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఒకే పంటపై ఆధారపడకుండా పంట వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను వినిగియోగించడం వల్ల భూసారం మెరుగుపడుతుంది. వరికొయ్యలను కల్చకుండా దుక్కిలో కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది.

  • నరేష్‌, మండల వ్యవసాయాధికారి, రాయపోల్‌


ఈ వార్తలు కూడా చదవండి:

ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది?

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తప్పిన పెను ప్రమాదం..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 01:03 PM