Share News

ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది?

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:43 AM

సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌ రికార్డుల్లో పేర్కొన్న 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది? కోల్‌ స్టాక్‌ పాయింట్ల దగ్గర కనిపించని ఆ బొగ్గు ఏమైంది...

ఆ 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది?

  • రూ.1600 కోట్ల కుంభకోణంపై నిగ్గు తేల్చండి

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ‘సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌ రికార్డుల్లో పేర్కొన్న 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడుంది? కోల్‌ స్టాక్‌ పాయింట్ల దగ్గర కనిపించని ఆ బొగ్గు ఏమైంది? సింగరేణిలో రూ.1600 కోట్ల ఈ కుంభకోణంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి నిగ్గు తేల్చండి’ అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. 40 లక్షల టన్నుల బొగ్గుమీద కోల్‌ సెస్‌తోపాటు, ఆదాయపు పన్ను కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డితో మిలాఖత్‌ లేకుంటే.. తక్షణం ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 06 , 2026 | 04:43 AM