ధోని సరసన పంత్.. టెస్టుల్లో అరుదైన ఘనత
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:38 PM
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. అఫ్గాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టుతో అతడు 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత వికెట్ కీపర్ల జాబితాలోకి చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వైస్ కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ జట్టులో అతడిని ఎంపిక చేసి.. తుది జట్టులోనూ అవకాశం ఇచ్చారు. దీంతో అఫ్గాన్‌తో జరుగుతోన్న ఏకైక టెస్టుతో అతడు 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత వికెట్ కీపర్ల జాబితాలోకి చేరాడు. ఈ ఘనత సాధించిన భారత మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో భారత్ నుంచి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(90 టెస్టులు), సయ్యద్ కిర్మాణి(88 టెస్టులు) ముందున్నారు. ఇప్పుడు పంత్ కూడా వీరి సరసన చోటు దక్కించుకున్నాడు.
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన 34వ వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఈ జాబితాలో ఓవరాల్‌గా కేవలం ఇద్దరు మాత్రమే 100కిపైగా టెస్టులు ఆడారు. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మార్క్ బౌచర్(147), ఆసీస్ క్రికెటర్ ఇయాన్ హీలే(119) మాత్రమే ఈ మార్క్‌ను దాటారు. ఇక 90కి పైగా టెస్టులు ఆడిన వికెట్ కీపర్ల జాబితాలో ధోనితో పాటు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రాడ్ మార్ష్, అలన్ నాట్, ఇవాన్స్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
వీడ్కోలు సంస్కృతికి గుడ్‌బై.. భారత క్రికెట్‌లో కొత్త యుగం!
అఫ్గాన్ టెస్టుతో భారత ఆల్‌రౌండర్ అరంగేట్రం.. ఎవరీ మానవ్ సుతార్?