Share News

అఫ్గాన్‌తో టెస్టు: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 96/1

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:15 PM

ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 25 ఓవర్లలో వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది.

అఫ్గాన్‌తో టెస్టు: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 96/1
India vs Afghanistan Test

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 25 ఓవర్లలో వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(37*), సాయి సుదర్శన్(32*) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్(24) దూకుడుగానే ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అఫ్గాన్ బౌలర్ సలీమ్ సాఫి బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యశస్వికి లైఫ్ దక్కింది. కానీ దాన్ని అతడు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.


ఇవి కూడా చదవండి:

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

Updated Date - Jun 06 , 2026 | 12:15 PM