Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!

ABN , Publish Date - Jun 05 , 2026 | 06:04 PM

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ నుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!
Michael Clarke

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ నుంచి విమానాశ్రయానికి వెళ్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని తాజగా క్లార్క్ స్వయంగా వెల్లడించాడు. ఓ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న క్లార్క్.. ఈ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు సహాయం చేసిన భారతీయులకు క్లార్క్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.


‘ఐపీఎల్ ఫైనల్‌కు కామెంటేటర్‌గా హాజరయ్యాను. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎయిర్‌పోర్డుకు వెళ్తూ కారులోనే నిద్రపోయాను. ఒక్కసారి పెద్ద శబ్దం వినిపించింది. లేచి చూసేసరికి మా కారుకు ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం ఓ ట్రక్కు కిందకి దూసుకెళ్లింది. ఆ క్షణం చాలా భయంకరంగా అనిపించింది. ఈ ప్రమాదంలో మా కారు పూర్తిగా ధ్వంసమైంది. నాకు కొన్ని గాయాలు అయ్యాయి. మా డ్రైవర్ కాలు ఫ్రాక్చర్ అయింది. అతడు కూడా చాలా భయపడిపోయాడు. అయితే అది డ్రైవర్ సొంత కారు కాదు. ఓ కంపెనీ నుంచి రెంట్‌కు తీసుకుని నడిపిస్తున్నాడు. వాహనం మొత్తం డ్యామెజ్ అవ్వడం చూసి ఇంకా ఎక్కువ ఆందోళన చెందాడు’ అని క్లార్క్ వివరించాడు.


అందరికీ రుణపడి ఉంటా..

‘ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. బీసీసీఐ అధికారులు కూడా మా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సహకరించారు. భారత్‌లోని మంచి మనుషుల వల్లే నేను క్షేమంగా ఇంటికి చేరగలిగాను. బీసీసీఐ అధికారులు కూడా అండగా నిలిచారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అని క్లార్క్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. రాబిన్సన్ బౌలింగ్‌లో వైభవ్ నిలబడగలడా?

టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి పంత్ తొలగింపు.. గంభీర్ రియాక్షన్ ఇదే!

Updated Date - Jun 05 , 2026 | 06:04 PM