ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం.. అకాల్ తఖ్త్ వద్ద ఖలిస్థాన్ నినాదాలు..
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:37 AM
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ప్రముఖ సిక్కు మత కేంద్రం అకాల్ తఖ్త్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్ బ్లూ స్టార్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న ప్రముఖ సిక్కు మత కేంద్రం అకాల్ తఖ్త్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్ బ్లూ స్టార్ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఖలిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. సిక్కు మిలిటెంట్ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే పోస్టర్లు వెలిశాయి. జూన్ 6, 1984న భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భింద్రన్‌వాలే మరణించారు (Operation Blue Star anniversary).
ప్రతి ఏటా జూన్ 6వ తేదీన సిక్కు సమాజంలోని కొన్ని వర్గాలు 'ఘల్లోఘారా దివస్'గా పాటిస్తాయి. ఈ ఏడాది కూడా భింద్రన్ వాలేను స్మరించుకుంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పంజాబ్ పోలీసులు అమృత్‌సర్, దాని పరిసర ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు (Khalistan slogan).
శాంతిభద్రతల ప్రత్యేక డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్ సిన్హా జూన్ 4న జిల్లాలో పర్యటించి, బలగాల మోహరింపును సమీక్షించారు. దాదాపు 4,000 మంది పోలీసు సిబ్బందిని రక్షణ కార్యక్రమాల్లో భాగం చేశారు. కాగా, భింద్రన్‌వాలేను (Jarnail Singh Bhindranwale) సిక్కు సమాజంలోని కొంతమంది అమరవీరుడిగా భావిస్తే, మరికొందరు ఆయనను పంజాబ్‌లో తీవ్రవాద ఉద్యమానికి ప్రతీకగా చూస్తారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..