అది పూర్తిగా మా అంతర్గత విషయం.. పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్..
ABN , Publish Date - Jun 06 , 2026 | 09:42 AM
ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమైనవని, తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నమని భారత ప్రతినిధి మండలి పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి (UNO) వేదికగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమైనవని, తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నమని భారత ప్రతినిధి మండలి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పాక్‌కు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కౌంటర్ ఇచ్చారు (India Pakistan UN).
'జమ్మూ కశ్మీర్ గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుంది. పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలను తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా భారతదేశ అంతర్గత విషయాలు. పాకిస్థాన్ డొల్ల మాటలు, వాదనలు ఈ ప్రాథమిక వాస్తవాన్ని మార్చలేవు' అని హరీష్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితలో పాకిస్థాన్.. కశ్మీర్‌ను 'అంతర్జాతీయంగా గుర్తించిన వివాదాస్పద ప్రాంతం'గా పేర్కొంది (India rebukes Pakistan).
కాగా, గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతానికి జూన్ 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ ప్రణాళికలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది (Pakistan remarks on Kashmir). ఆ ప్రాంతం చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమణకు గురైన భారత భూభాగమని పేర్కొంది. గిల్గిత్-బాల్టిస్తాన్ అనేది లడఖ్‌లో భాగమని, ప్రస్తుతం అది పాకిస్థాన్ ఆక్రమణలో ఉందని భారత్ చెబుతోంది. అందుకే అక్కడ ఎన్నికలు నిర్వహించడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..