బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:54 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
శనివారం నాడు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలపడడం మొదలైన కారణాలతో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,720గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,740గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,870గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,890గా ఉంది. (Gold Rate live).
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,79,900గా, బెంగళూరులో రూ.2,74,900గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి:
పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుతని వెంటాడిన పులి.. వీడియో వైరల్
జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్