పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుతని వెంటాడిన పులి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:33 PM
భారతదేశంలోని ప్రముఖ పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఆధిపత్య పోరాటానికి సంబంధించిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పెంచ్ టైగర్ రిజర్వ్ (Pench Tiger Reserve) పార్క్‌లో చిరుత, పెద్ద పులి పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవిలో సఫారీ చేస్తున్న పర్యాటకుల కళ్లెదుటే ఒక పులి.. చిరుతని అత్యంత వేగంగా తరుముతూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పులి దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చిరుతపులి క్షణాల వ్యవధిలో చెట్టుపైకి ఎక్కి తప్పించుకుంది. ఈ అద్భుత దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.
సాధారణంగా భారతీయ అడవుల్లో పులులు, చిరుతపులులు ఒకే ప్రాంతంలో సహజీవనం సాగిస్తున్నప్పటికీ.. వాటి మధ్య ఇలాంటి ప్రత్యక్ష ఘర్షణలు జరగడం, అవి కెమెరాకు చిక్కడం చాలా అరుదు. పులులు తమ సరిహద్దుల (Territory) విషయంలో అత్యంత కఠినంగా ఉంటాయని, తమ సామ్రాజ్యంలోకి ఇతర పెద్ద జంతువుల చొరబాటును అస్సలు సహించవనే దానికి ఈ ఘటనే నిదర్శనం. పెంచ్ అడవుల్లో లైవ్‌లో పులి-చిరుతల మధ్య జరిగిన ఈ పోరాటం వన్యప్రాణి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read:
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026.. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత