Share News

వావ్.. ఏఐతో జంతువుల భాషను ఛేదించే ప్రయత్నాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:26 PM

ఏఐ రాకతో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ సాయంతో జంతువుల శబ్దాల వెనకున్న అర్థాలను కనిపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

వావ్.. ఏఐతో జంతువుల భాషను ఛేదించే ప్రయత్నాలు
AI in Decoding Animals Sounds

ఇంటర్నెట్ డెస్క్: మనుషులు జంతువులతో మాట్లాడే రోజు కూడా దగ్గర్లో ఉందా? పక్షుల కిచకిచలు, ఏనుగుల ఘీంకారాల, శునకాల భౌభౌల వెనుకున్న అర్థాలను గుర్తించే ఛాన్స్ ఉందా? అంటే ఎవరైనా ప్రస్తుతం అసాధ్యమనే చెబుతారు. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం ఏఐ సాయంతో ఈ దిశగా పరిశోధనలను వేగవంతం చేశారు. ఈ దిశగా కొంత పురోగతి కూడా సాధిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

జంతువులు రకరకాల శబ్దాలు చేస్తుంటాయి. ఒక్కో సందర్భంలో ఒక్కోలా స్పందిస్తుంటాయి. వీటన్నిటినీ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్ (చాట్‌జీపీటీ వెనుకున్న సాంకేతికత) సాయంతో విశ్లేషిస్తున్నారు. జంతువులు చేసే శబ్దాల్లో స్వల్ప తేడాలు, ధోరణుల ఆధారంగా వాటి వెనకున్న అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిలియన్‌ల కొద్దీ శబ్దాలను జల్లెడ పడుతున్నారు. ఒకప్పుడు అత్యంత సంక్లిష్టంగా అనిపించిన ఈ వ్యవహారంలో కృత్రిమే మేధ కొత్త అవకాశాలను సృష్టిస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు.


ఎలుకలు, డాల్ఫిన్లు, గొరిల్లాలు, తిమింగలాల వంటి వివిధ జంతువుల శబ్దాలను అర్థం చేసుకోవడంలో ఇప్పటికే కొంత పురోగతి కూడా చోటుచేసుకుంది. ఉదాహరణకు ఆఫ్రికా స్ట్రైప్డ్ మైస్ అనే ఎలుకలు చేసే 1.22 లక్షల శబ్దాలను పరిశీలించి వాటిలోని వివిధ రకాల శబ్దాలను గుర్తించగలిగారు. డాల్ఫిన్లు, తిమింగలాల విషయంలో కూడా ఇలాంటి అధ్యయనం జరుగుతోంది. ముఖ్యంగా తిమింగలాల మధ్య సమాచార మార్పిడి ముందున్న అంచనాల కంటే ఎంతో సంక్లిష్టమైనదని శాస్త్రవేత్తలు గుర్తించారు. జంతువుల శబ్దాలను అర్థం చేసుకోవడంతో పాటు ఏఐ సాయంతో కనీసం పరిమిత స్థాయిలో అయినా వాటితో సమాచార మార్పిడి అవకాశాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా పరస్పర సంభాషణ సాధ్యమేనా? అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నిస్తున్నారు.

అయితే, జంతువుల మధ్య సమాచార మార్పిడి మనుషుల మధ్య సంభాషణతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. జంతువుల తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషులకు భిన్నమైన రీతిలో అర్థం చేససుకుంటాయని చెబుతున్నారు. కాబట్టి, జంతువుల శబ్దాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో సాంకేతిక సవాళ్లు అనేకం ఎదురవుతున్నాయి. ఏఐ సాయంతో ఈ దిశగా ఎంతో కొంత పురోగతి సాధ్యమని కూడా శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అత్త కోరిక నెరవేర్చాలని.. తలపై మోస్తూ 260 కి.మీ.ల పాదయాత్ర

ఫ్రీ ఫుడ్ కోసం తప్పుడు పని.. అడ్డంగా దొరికిపోయిన మహిళ..

Updated Date - Jun 04 , 2026 | 04:37 PM