Share News

ఫ్రీ ఫుడ్ కోసం తప్పుడు పని.. అడ్డంగా దొరికిపోయిన మహిళ..

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:45 PM

ఓ మహిళ భోజనం తిని, డబ్బులు ఎగ్గొట్టడం కోసం తప్పుడు పనికి తెరతీసింది. తినే ఫుడ్‌లో వెంట్రుక వేసింది. అయితే, ఆమె ప్లాన్ సీసీకెమెరా కారణంగా ఫెయిల్ అయింది. రెస్టారెంట్ యాజమాన్యం ఆమెను తిట్టి అక్కడినుంచి పంపేశారు.

ఫ్రీ ఫుడ్ కోసం తప్పుడు పని.. అడ్డంగా దొరికిపోయిన మహిళ..
UK restaurant viral video

ఇంటర్‌నెట్ డెస్క్: రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న సమయంలో మనం తినే ఆహారంలో వెంట్రుక వస్తే ఎలా ఉంటుంది?. మొదట కోపం వస్తుంది. తర్వాత హోటల్ సిబ్బందిని పిలిచి దాని గురించి ఫిర్యాదు చేస్తాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ మహిళ భోజనం తిని, డబ్బులు ఎగ్గొట్టడం కోసం తప్పుడు పనికి తెరతీసింది. తినే ఫుడ్‌లో వెంట్రుక వేసింది. అయితే, ఆమె ప్లాన్ సీసీకెమెరా కారణంగా ఫెయిల్ అయింది. రెస్టారెంట్ యాజమాన్యం ఆమెను తిట్టి అక్కడినుంచి పంపేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


యూకేకు చెందిన ఓ మహిళ ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లింది. కుటుంబసభ్యులందరూ కలిసి భోజనం చేశారు. భోజనం ముగిసే సమయానికి ఆ మహిళకు పిచ్చి ఆలోచన వచ్చింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని భయపెట్టి.. తిన్న భోజనానికి డబ్బులు కట్టకుండా వెళ్లిపోవాలని భావించింది. ఓ వెంట్రుకను తీసి ఆహారంలో పడేసింది. తర్వాత రెస్టారెంట్ సిబ్బందిని పిలిచింది. తినే ఆహారంలో వెంట్రుక పడిందని అంటూ గొడవకు దిగింది. ఆమె ప్రవర్తనపై సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ కెమెరాను పరిశీలించారు. దీంతో ఆమె చేసిన పాడు పని బయటపడింది.


హోటల్ యాజమాన్యం మహిళను తిట్టి, బిల్లు కట్టించుకుని అక్కడినుంచి పంపేసింది. ఎంతో తెలివిగా వ్యవహరించి మహిళ తప్పును బయటపెట్టిన సిబ్బందిపై ప్రశంసలజల్లులు కురిపించింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పల్లెవెలుగులో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు

పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు

Updated Date - Jun 04 , 2026 | 02:31 PM