పల్లెవెలుగులో ఎక్స్‌ప్రెస్ చార్జీలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:38 PM
ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి, ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
బోర్డులు పెట్టి వసూళ్లు..
ప్రయాణికుల జేబులకు చిల్లు
నారాయణఖేడ్(సంగారెడ్డి): ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి, ప్రయాణికుల నుంచి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సంగారెడ్డి డిపోకు చెందిన ఒక పల్లెవెలుగు బస్సును మంగళవారం నారాయణఖేడ్ నుంచి లింగంపల్లికి నడపగా, దానికి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పల్లెవెలుగు బస్సులను గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే నడపాల్సి ఉండగా, అధికారుల తీరుతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ బస్సులో 44 సీట్లు ఉండి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, పల్లెవెలుగులో 55 సీట్లు ఉండి, ప్రయాణానికి అంత సౌకర్యంగా ఉండవు. అయినా, ఎక్స్‌ప్రెస్ చార్జీలను వసూలు చేయడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పల్లె వెలుగు బస్సులను గ్రామీణ ప్రాంతాలకే నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా
Read Latest AP News And Telangana News And International News And Telugu News