Share News

విరాట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. అఫ్గానిస్థాన్‌తో వన్డేలకు దూరం!

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:38 PM

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలుగుతాడని సమాచారం.

విరాట్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. అఫ్గానిస్థాన్‌తో వన్డేలకు దూరం!
Virat Kohli injury

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్లూ జెర్సీ ధరించి ఆడుతుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలో అఫ్గానిస్థాన్ తో జరిగే వన్డే సరీస్ లో విరాట్ కనిపిస్తాడని సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారిని నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు విరాట్ దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలుగుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.


వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాల్లో భాగంగా అఫ్గాన్‌తో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఈనెల 13 నుంచి 20 వరకు మూడు మ్యాచులు జరగనున్నాయి. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ టాప్‌ స్కోరర్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లోనూ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు.


మరోవైపు తుది పోరు సమయంలో కోహ్లీ తొండ కండరాల నొప్పితో బాధపడటం చూశాం. రెండు సార్లు ఫిజియోతో సపర్యలు చేయించుకొని మరీ చివరివరకూ బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో విరాట్ కు వచ్చిన నొప్పి చిన్నదేమో అని అందరూ భావించారు. కానీ.. ఇంకా ఆ నొప్పి తగ్గకపోవడంతో అఫ్గాన్ సిరీస్ కు విరాట్ దూరం కావచ్చని బీసీసీఐ ఐర్గాలు తెలిపాయి.


అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌ షెడ్యూల్

  • జూన్ 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే

  • జూన్ 17న ఏక్‌నా స్టేడియంలో రెండో వన్డే

  • జూన్ 20న చెపాక్‌ వేదికగా మూడో వన్డే

ఈ మ్యాచులన్నీ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి.


ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 04 , 2026 | 12:43 PM