Share News

జూన్ 4.. వైసీపీ విధ్వంసానికి ముగింపు.. అభివృద్ధి యుగానికి నాంది: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:20 PM

రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇదని పేర్కొన్నారు.

జూన్ 4.. వైసీపీ విధ్వంసానికి ముగింపు.. అభివృద్ధి యుగానికి నాంది: మంత్రి మండిపల్లి
AP Minister Mandipalli Ramprasad Reddy

అమరావతి, జూన్4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (AP Minister Mandipalli Ramprasad Reddy) వ్యాఖ్యానించారు. ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఇదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని ఉద్ఘాటించారు. ఈరోజు (గురువారం) వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి మండిపల్లి మాట్లాడారు. జగన్ అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు శాశ్వతంగా చరమగీతం పాడారని చెప్పుకొచ్చారు.


వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారని మంత్రి మండిపల్లి తెలిపారు. రాష్ట్రాన్ని బందిపోటు దొంగల ముఠాలా నడిపిన పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. వ్యక్తిగత కక్షలు, వేధింపుల రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలికారని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు కూటమికి అఖండ మద్దతు ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టిందని చెప్పుకొచ్చారు.


అమరావతి పునర్నిర్మాణం కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని మంత్రి మండిపల్లి వెల్లడించారు. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని వివరించారు. వైసీపీ విధ్వంసానికి ముగింపు పలికి, అభివృద్ధి యుగానికి నాంది పలికేలా కూటమి విజయం సాధించిన ఈ రోజు మరపురానిదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 12:23 PM