Share News

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:06 PM

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించారు. జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
Pawan Kalyan

అమరావతి, జూన్4 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియమించారు. జనసైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని అధినేత చెప్పుకొచ్చారు.


25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 01:08 PM