Share News

బావి నీరు ఇలా.. తాగేదెలా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:43 PM

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని దుర్శేడ్‌ వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.

బావి నీరు ఇలా.. తాగేదెలా?
Drinking Water

  • దుర్శేడ్‌లో తాగు నీటి కష్టాలు

  • కలుషితమైన బావి నీరు

  • పట్టించుకోని అధికారులు

కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని దుర్శేడ్‌ వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తమ గ్రామంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వాళ్లమని, కార్పొరేషన్‌లో విలీనం తర్వాత ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్శేడ్‌లొ మూడు వాటర్‌ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులకు వాగులో ఉన్న బావి నుంచి నీరు సరఫరా అవుతుంది. ఆ బావి నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారింది. బావి చెత్తాచెదారంతో నిండి మురికి కూపాన్ని తలపిస్తోంది.


బావిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా చల్లడం లేదని దుర్శేడ్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు వేసి తాగు నీరందించాలని కోరుతున్నారు. ఈ బావికి పై కప్పు వేసి చెత్తపడకండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాని దుర్శేడ్‌ వాసులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టు సడలిన ఐటీడీఏ పాలన

లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 12:43 PM