తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jun 04 , 2026 | 09:16 AM
చంద్రగిరి మండల పరిధిలోని అగరాల సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుమీదకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది.
తిరుపతి జిల్లా, జూన్4 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండల పరిధిలోని అగరాల సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుమీదకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న కారును ఐచర్ వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తిరుపతి జీవకోన ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ రాజ్‌కుమార్ (35) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. అదే సమయంలో ప్రమాదంలో వెంకటేష్ నాయుడు, ఐచర్ డ్రైవర్ నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News