‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:55 AM
ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు.
అమరావతి / తిరువనంతపురం (కేరళ), జూన్4 (ఆంధ్రజ్యోతి): ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యాటకంలో 48 శాతం అద్భుత వృద్ధితో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. కేరళంలో రెండో రోజు మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించారు. ఈరోజు(గురువారం) కోవాలంలో జరుగుతున్న 'గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026' అవార్డుల వేడుకల్లో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డును మంత్రి దుర్గేశ్ నేడు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశాన్ని 'గ్లోబల్ టూరిజం పవర్‌హౌస్'గా మారుద్దామని పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని.. పర్యాటక పెట్టుబడిదారులు, టూర్ ఆపరేటర్లకు మంత్రి దుర్గేశ్ సాదరంగా ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగ ప్రగతిని, విశిష్టతలను చాటిచెబుతూ ప్రదర్శించిన ప్రత్యేక పెవిలియన్ అందరినీ ఆకట్టుకుందని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News