పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు.. బండ్ల గణేశ్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:34 AM
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంశంలో నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా ఎక్స్‌లో వార్ నడుస్తోంది. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సెటైర్ వేస్తే.. ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 4: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంశంలో నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా ఎక్స్‌లో వార్ నడుస్తోంది. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సెటైర్ వేస్తే.. ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీపై ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. పవన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీరొస్తామంటే మేమొద్దంటామా.. రండి దొర. సింగిల్‌గా వస్తున్నారా.. పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి’ అని ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు.
ముందు నీ అడ్రస్ తెలుసుకో: బండ్ల గణేశ్
ప్రకాశ్‌రాజ్ పోస్ట్‌కు బండ్ల గణేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో ఎందుకు వేలు పెడతావంటూ ప్రశ్నించారు. ‘అసలు నువ్వెవరు.. తమిళోడివా? తెలుగోడివా? కన్నడిగుడివా? ప్రతి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా. అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్’ అంటూ ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా ఎక్స్ వేదికగా జరుగుతున్న వార్.. చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం: మంత్రి నారాయణ
ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Read Latest Telangana News And Telugu News