Share News

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:54 AM

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి
Medchal News

మేడ్చల్, జూన్ 4: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. 3వ అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తున్న కార్మికుడు.. అక్కడి నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవర రవిగా గుర్తించారు.


సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిర్మాణ సంస్థ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. కార్మికుడి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన తమ బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం: మంత్రి నారాయణ

ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 11:36 AM