Share News

ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:06 AM

విధ్వంస పాలన నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభించి రెండేళ్లు పూర్తి అయ్యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనతో జగన్.. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు.

ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Minister Kondapalli Srinivas

అమరావతి, జూన్ 4: విధ్వంస పాలన నుంచి ఏపీ ప్రజలకు విముక్తి లభించి రెండేళ్లు పూర్తి అయ్యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలను జగన్ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన ఏపీ ప్రజలు.. 2029లోనూ అదే తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మళ్లీ ప్రజాస్వామ్య వెలుగులు కనిపిస్తున్నాయన్నారు.


గత ప్రభుత్వ విధ్వంసాన్ని సరిదిద్దుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెడుతున్నారు:కేశినేని నాని

రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 10:33 AM