Share News

రేపటి నుంచి విద్యార్థులకు బస్‌పాస్‏లు

ABN , Publish Date - Jun 04 , 2026 | 09:34 AM

విద్యార్థులకు ఈ నెల 5 నుంచి బస్‌పాస్‏లు జారీ చేసేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.రాజశేఖర్‌ తెలిపారు.

రేపటి నుంచి విద్యార్థులకు బస్‌పాస్‏లు
Student Bus Passes

  • జారీకి గ్రేటర్‌ ఆర్టీసీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: విద్యార్థులకు ఈ నెల 5 నుంచి బస్‌పాస్‏లు జారీ చేసేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.రాజశేఖర్‌ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్టూడెంట్‌ బస్‌పాస్‏లను జారీ చేస్తున్నామన్నారు. ఫ్రీ, రూట్‌, స్టూడెంట్‌ జనరల్‌, స్టూడెంట్‌ గ్రేటర్‌, స్పెషల్‌, స్టూడెంట్‌ ఎక్స్‌క్లూజివ్‌, డిస్ర్టిక్ట్‌ రూట్‌పాస్‏లకు టీజీఎస్‌ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో https://tgsrtc-pass.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ప్రైవేట్‌ విద్యా సంస్థలన్నీ ప్రస్తుతమున్న బస్‌పాస్‌ కోడ్‌ రెన్యూవల్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీలు చెల్లించి, అవసరమైన పత్రాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సమర్పించాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కూడా టీజీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పత్రాలు, ప్రొఫార్మా షీట్‌తో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాల టీజీఆర్టీసీపాస్‌ వెబ్‌సైట్‌, 80082 04216 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

city3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..

లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 09:34 AM