డ్రగ్స్ పెడ్లర్‌ను పట్టించిన ర్యాపిడో రైడర్
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:55 AM
హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో గంజాయి రవాణాకు పాల్పడిన ఓ డ్రగ్స్ పెడ్లర్‌ను.. ర్యాపిడో రైడర్ పట్టించాడు. ఈ సమాచారాన్ని రైడర్ పోలీసులకు వెంటనే తెలియజేయడంతో డ్రగ్స్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, జూన్4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో గంజాయి రవాణాకు పాల్పడిన ఓ డ్రగ్స్ పెడ్లర్‌ను.. ర్యాపిడో రైడర్ పట్టించాడు. ఈ సమాచారాన్ని రైడర్ పోలీసులకు వెంటనే తెలియజేయడంతో డ్రగ్స్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పెడ్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 31వ తేదీన బీహార్‌కు చెందిన రూపేశ్ కుమార్ మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు ర్యాపిడో ద్వారా ఓ పార్సిల్ బుక్ చేశాడు. అయితే ఈ పార్సిల్‌పై అనుమానం వచ్చిన ర్యాపిడో డ్రైవర్ ఆదర్శన్ వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు పార్సిల్‌ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రూపేశ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి, మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై విచారణ చేస్తున్నారు.
ఈ ఘటనలో అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సహకరించిన ర్యాపిడో రైడర్ ఆదర్శన్‌ను డీసీపీ కోటిరెడ్డి అభినందించి, ప్రత్యేకంగా సన్మానించారు. ఆయన చొరవతో మాదకద్రవ్యాల రవాణా ప్రయత్నం విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News