Share News

ఫోన్‌లో మునిగిపోయింది.. మ్యాన్‌హోల్‌లో పడిపోయింది! వీడియో వైరల్

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:40 PM

రోడ్లపై నడిచేటప్పుడు చాలామంది ఫోన్లు చూసుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ఫోన్‌లో మునిగిపోయింది.. మ్యాన్‌హోల్‌లో పడిపోయింది! వీడియో వైరల్
Woman Falls into Manhole

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని అందిస్తే, మరికొన్ని మాత్రం చూసేవారిని ఒక్కక్షణం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే, ఆమె తన చేతిలోని ఫోన్ చూసుకుంటూ.. ముందు ఏముందన్న విషయాన్ని గమనించలేదు.


ఆమె అలా ఫోన్ చూస్తూ ముందుకు నడుస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి చూస్తుండగానే ఎదురుగా ఉన్న మ్యాన్‌హోల్ పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ఆమె ఎలా బయటపడుతుందోననే ఆందోళన కలిగింది. కానీ అదృష్టవశాత్తూ దూరం నుంచి ఒక వ్యక్తి గమనించి.. పరుగెత్తుకుంటూ వచ్చాడు. మ్యాన్‌హోల్ మూత తీసి, ఆమెను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. రోడ్లపై నడిచేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.


ఇవీ చదవండి:

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

Updated Date - Jun 04 , 2026 | 06:33 PM