Share News

జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:44 PM

ముంబై నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్
Mumbai Bandra Viral Incident

ఇంటర్నెట్ డెస్క్: ముంబై నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో చోటుచేసుకున్న.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బాంద్రాలోని ఫేమస్ లక్కీ రెస్టారెంట్ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఎలాంటి చలనమూ లేకుండా, ఒకే స్థితిలో నిశ్చలంగా నిలబడి ఉన్న దృశ్యాలు అందరినీ షాక్‌కి గురిచేస్తున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, అమెరికా వంటి దేశాలను వణికించే ప్రమాదకరమైన 'జాంబీ డ్రగ్' ప్రభావం ఇప్పుడు ముంబై నగరానికి కూడా పాకిందా అనే అనుమానాలను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు వ్యక్తి చుట్టూ వాహనాలు, జనం తిరుగుతున్నప్పటికీ దేనికీ స్పందించకుండా ఒకే చోట స్తంభించిపోయి కనిపించాడు. అతను తీవ్రమైన మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నాడని, చాలా సేపటి నుంచి గమనిస్తున్నా.. ఒక జాంబీలా నిలబడిపోయాడని.. వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి తెలిపాడు. ఈ వింత ప్రవర్తన వెనుక కచ్చితంగా జాంబీ డ్రగ్స్ వాడకమే ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత ఏప్రిల్‌లో కూడా ఇలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఒక యువకుడు ఎండలో కళ్లు మూసుకుని చుట్టూ ఉన్న పరిసరాలను పట్టించుకోకుండా రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. అప్పట్లో కూడా ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడా లేక ఏదైనా తీవ్రమైన మానసిక, వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడా అనే చర్చ జరిగింది. ప్రస్తుతం బాంద్రా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - Jun 05 , 2026 | 04:44 PM