Share News

చైనాలో షాకింగ్ ఘటన.. చిన్నారిపై రోబో దాడి

ABN , Publish Date - Jun 05 , 2026 | 02:59 PM

చైనాలోని ఒక ప్రదర్శనలో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో.. అదుపు తప్పి ఓ చిన్నారిపై దాడి చేసింది. కడుపులో బలంగా తన్నడంతో ఆ బాలుడు నొప్పితో కుప్పకూలాడు..

చైనాలో షాకింగ్ ఘటన.. చిన్నారిపై రోబో దాడి
Robot Kicks Child

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న హ్యూమనాయిడ్ రోబోలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా చైనాలోని షింజియాగ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. స్థానికంగా ఏర్పాటు చేసిన రోబోల ప్రదర్శనలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ రోబో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తుండడంతో చుట్టూ ఉన్న జనం ఆసక్తిగా చూస్తున్నారు. రోబో విన్యాసాలను చూస్తూ చిన్నారులు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో రోబో అదుపు తప్పి అక్కడే నిలబడ్డ ఒక చిన్నారి కడుపులో బలంగా తన్నింది. దీంతో ఆ బాలుడు నొప్పితో కుప్పకూలిపోయాడు.


ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అక్కడి అధికారులు బాలుడికి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రోబోల భద్రత, వాటి సెన్సార్ల పనితీరుపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమూహాల్లో రోబోలను ప్రదర్శించేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.


ఇవి కూడా చదవండి

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీ నుంచి పిలుపు!

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

Updated Date - Jun 05 , 2026 | 03:32 PM