Share News

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

ABN , Publish Date - Jun 05 , 2026 | 08:44 AM

భీమునిపట్నం పరిధిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకుల అరెస్ట్
Four Youths Arrested with 2 Kg Ganja in Bheemunipatnam, Visakhapatnam

భీమిలి, మే 5: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో గంజాయి రవాణా, విక్రయాలపై వస్తున్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్, భీమిలి పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. నిన్న రాత్రి భీమిలి పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన రెండు కిలోల గంజాయి పట్టుబడింది.


అరెస్ట్ అయిన వారిలో నలుగురు యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాలు.. 1. జొండి అఖిల్ (30) 2. వాసుపల్లి జితేష్ (27) 3. సాయికుమార్ (27) 4. చెన్నా తేజ సుజీ (20) నిందితులు ఈ గంజాయిని భీమిలిలోని కృష్ణ కాలనీ పరిసర ప్రాంతాల్లో యువతకు, విద్యార్థులకు రహస్యంగా విక్రయించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు.. వీరికి ఈ గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అయింది? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం’లాంటి కట్టుకథ!

తాజా నిబంధనల మేరకే పదోన్నతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 08:58 AM