Share News

నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

ABN , Publish Date - Jun 06 , 2026 | 07:15 AM

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో చారిత్రక ఘనత సాధించాడు. నార్వే 2026 చెస్ టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

నార్వేలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..
R Praggnanandhaa

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో చారిత్రక ఘనత సాధించాడు. నార్వే 2026 చెస్ టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పోటీలో విజయం సాధించడం ద్వారా ప్రజ్ఞానంద భారత చెస్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు (R Praggnanandhaa Norway Chess title).


నార్వేలో జరిగిన టోర్నమెంట్ చివరి రౌండ్‌లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్‌‌పై గెలుపొందాడు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో పాల్గొనడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఏడుసార్లు నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రపంచ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఈ టోర్నీలో ప్రజ్ఞానంద మూడు సార్లు ఓడించాడు. టోర్నమెంట్ ప్రారంభ దశలో వెనుకబడినప్పటికీ, రెండో భాగంలో పుంజుకుని వరుసగా అద్భుత ఫలితాలు నమోదు చేస్తూ అగ్రస్థానానికి చేరుకున్నాడు (Praggnanandhaa Norway Chess winner).


పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ప్రజ్ఞానంద.. చివరి రౌండ్‌లో విజయం సాధించి మరో మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు (Norway Chess 2026). ఇక, పదో రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ 17 పాయింట్లకే పరిమితమయ్యాడు. దీంతో 18 పాయింట్లతో టాప్‌లో నిలిచిన ప్రజ్ఞానంద టైటిల్ దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన మరో గ్రాండ్ మాస్టర్ గుకేశ్ చివరి రౌండ్‌లో ఓటమిపాలయ్యాడు. 8 పాయింట్లతో చివరి స్థానానికి పరిమితమయ్యాడు.


ఇవి కూడా చదవండి:

పెంచ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం.. చిరుత‌ని వెంటాడిన పులి.. వీడియో వైరల్

జాంబీ డ్రగ్స్ ఎఫెక్ట్.. రోడ్డుపై ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో వైరల్

Updated Date - Jun 06 , 2026 | 07:19 AM