ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తప్పిన పెను ప్రమాదం..
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:32 AM
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి కరీంనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ భవన్ రెండో అంతస్తు నుంచి దిగుతూ లిఫ్ట్ ప్రమాదానికి గురైంది.
కరీంనగర్: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కరీంనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ భవన్ రెండో అంతస్తు నుంచి దిగుతూ లిఫ్ట్ ప్రమాదానికి గురైంది. సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది.
ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు లిఫ్ట్‌లో మరో ఆరుగురు ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే కవ్వంపల్లి లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఉప విద్యాధికారుల నియామకానికి నోటిఫికేషన్