Share News

ఉప విద్యాధికారుల నియామకానికి నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:48 AM

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 ఉప విద్యాధికారులు/గ్రేడ్‌-1 ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడింది.

ఉప విద్యాధికారుల నియామకానికి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 ఉప విద్యాధికారులు/గ్రేడ్‌-1 ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడింది. 18-44 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. ఈ పోస్టులకు ఈ నెల 12వ తేదీ నుంచి జూలై 19వ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు, మరిన్ని వివరాలు, అర్హతల కోసం www.tgpsc.gov.in అనే వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.

Updated Date - Jun 06 , 2026 | 04:48 AM