Share News

సూర్యాపేట జిల్లాలో విషాదం.. యువకుడు అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:41 AM

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సూర్యాపేట జిల్లాలో విషాదం.. యువకుడు అనుమానాస్పద మృతి

సూర్యాపేట జిల్లా, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటోలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సూర్యాపేట జిల్లా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


రత్నావత్ మణి భార్గవ్‌ మృతిపై అనుమానాలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఎంజీనగర్ తండా శివారులో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోలో ఓ యువకుడు విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. మృతుడిని రత్నావత్ మణి భార్గవ్‌గా గుర్తించారు. మృతుడు ఆటోలో ఉన్న ఇనుప రాడ్డుకు వేళాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియా, స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఆధారాల సేకరణ..

ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణి భార్గవ్‌కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించడానికి క్లూస్ టీమ్‌ను పోలీసులు రంగంలోకి దించినట్లు సమాచారం. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మణి భార్గవ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతను చివరిగా ఎవరితో మాట్లాడారు?, ఎవరితోనైనా ఛాటింగ్ చేశారా? అనే కాల్ డేటా రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.


కుటుంబ సభ్యుల ఆవేదన..

మణి భార్గవ్ మరణ వార్త విన్న అతని తండా, కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కొడుకుది ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారు: ఎంపీ రఘునందన్ రావు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం..!

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 11:03 AM