Share News

నేను రైతు కుంటుంబం నుంచి వచ్చి బత్తాయి సాగు చేశా: మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:45 PM

రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది... గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు.

నేను రైతు కుంటుంబం నుంచి వచ్చి బత్తాయి సాగు చేశా: మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy Venkat Reddy

నల్గొండ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని... గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) నల్గొండలో రాష్ట్ర సిట్రస్ సెమినార్ - 2026ను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలసి మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.


నల్గొండ జిల్లా పేరు చెప్పగానే బత్తాయి తోటలు గుర్తుకు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి ప్రస్తావించారు. గత నాలుగు దశాబ్దాలుగా వేలాదిమంది రైతుల జీవనాధారంగా బత్తాయి సాగు చేస్తున్నారని తెలిపారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. గతంలో స్వయంగా బత్తాయి సాగు చేసిన అనుభవం తనకు ఉందని వివరించారు. గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఓ వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని అన్నారు. పుస్తకాల్లో ఉండే శాస్త్రీయ జ్ఞానం రైతుల పొలాల వరకు చేరినప్పుడే వ్యవసాయ రంగంలో నిజమైన మార్పు వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 12:53 PM