తెలంగాణకు అమిత్ షా.. అక్టోబర్ 4న మెదక్ పర్యటన
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:37 AM
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది.
మెదక్ జిల్లా, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4వ తేదీన మెదక్ జిల్లాకు అమిత్ షా రానున్నారు. తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో ఆముల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న మిల్క్ బల్క్ యూనిట్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
5 లక్షల లీటర్ల కెపాసిటీతో మిల్క్ బల్క్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం అనంతరం రైతు బహిరంగ సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా మెదక్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News