సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:19 AM
సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సంగారెడ్డి జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఒక ఆటో డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందికంది సమీపంలో ఆటో వేగంగా వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో లావణ్య (39), రుక్మిణి (42) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో..
మరోవైపు.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల వద్ద జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరిగింది. CMR ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ముందున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News