హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:04 PM
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న వాటాలన్నీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థపై (Hyderabad Metro) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న వాటాలన్నీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 30వ తేదీలోగా సుమారు రూ.15 వేల కోట్ల డీల్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఈ మార్పుల నేపథ్యంలో మెట్రో రైల్ బోర్డులో కీలక నియామకాలు కూడా జరిగాయి.
బోర్డు చైర్మన్‌గా రామకృష్ణరావు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును బోర్డు చైర్మన్‌గా నియమించింది. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. అలాగే బోర్డు డైరెక్టర్లుగా జయేశ్ రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ సుల్తానియా, అలాగే శివధర్ రెడ్డిని తెలంగాణ సర్కార్ నియమించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ, విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి. షేర్ అలాట్‌మెంట్‌కు కూడా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు
మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
Read Latest Telangana News And AP News And International News And Telugu News