Share News

మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ABN , Publish Date - Apr 24 , 2026 | 07:25 PM

ప్రముఖ గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
Telangana High Court

హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని మంగ్లీ కేసులో (Popular Singer Mangli Case) న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఈ రోజు(శుక్రవారం) విచారణ జరిగింది. న్యాయవాది సుబ్బారావు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయక పోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాగుట్ట సీఐ రామకృష్ణను కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని భద్రపరిచారా? అని ప్రశ్నించింది.


సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కోర్టుకు ఎందుకు అందజేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సమర్పించడానికి కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌పై శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ఫైర్ అయింది. పోలీసులు, అడ్వకేట్లు కలిసి పనిచేయాలని న్యాయస్థానం సూచించింది.


స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు చేయడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. గాయని మంగ్లీతో ప్రాణహాని ఉందంటూ తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు న్యాయస్థానానికి సుబ్బారావు తరఫు న్యాయవాది తెలిపారు. న్యాయవాది సుబ్బారావు సెక్యూరిటీ విషయంపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.


ఇవీ చదవండి:

తెలంగాణలో రేషన్ పంపిణీ వేగవంతం

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.17 కోట్ల మత్తు పదార్థాలు సీజ్

Updated Date - Apr 24 , 2026 | 08:05 PM