Share News

కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తే చెప్పులతో కొడతారు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:13 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తే చెప్పులతో కొడతారు
MLA Palla Rajeshwar Reddy

  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

చేర్యాల(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రాంత వరప్రదాయిని అని పేర్కొన్నారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ పీసీసీ కమిషన్‌గా మారిందని విమర్శించిన ఆయన,


JGN1.2.jpgహైకోర్టు తీర్పు అందుకు నిదర్శనమన్నారు. అనంతరం వివిధ మండలాల లబ్ధిదారులకు రూ.13.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ముస్త్యాల అరుణ, వైస్‌ చైర్మన్‌ ఉమ, బీఆర్‌ఎస్‌ నేతలు అనంతుల మల్లేశం, మేక సంతోష్‌, మంద యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ హెచ్చరిక: సబిత

కిరాయి ఖాతాలు ఉంటే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2026 | 12:13 PM