పదో తరగతిపదో తరగతి ఫలితాలు ఎలా చూడాలంటే..
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:32 AM
ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికో గుడ్ న్యూస్. పదో తరగతి ఫలితాలను ఎస్ఎస్‌సీ బోర్డు(BSEAP) ఈనెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పదోతరగతి ఫలితాలను ఎస్ఎస్‌సీ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.inలో విడుదల చేయనుంది.
పదవ తరగతి విద్యార్థులు తమ ఫలితాలను results.bse.ap.gov.in లేదా bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను పైన పేర్కొన్న వెబ్‌సైట్లలో ఎంటర్ చేయడం ద్వారా మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఎలా చూడాలి..?
స్టెప్-1: అధికారిక సైట్లు bse.ap.gov.in లేదా results.bse.ap.gov.inని సందర్శించండి.
స్టెప్-2: ల్యాండింగ్ పేజీలో AP SSC Results 2026 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-3: హాల్ టికెట్ నంబర్ లేదా రోల్ నంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్-4: సమర్పించు(సబ్మిట్) బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-5: BSEAP 10, 12వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. పదో తరగతిపై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోండి.
స్టెప్-6: మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి