ఏపీఈసెట్‌కు 96.16 శాతం హాజరు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:57 AM
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ ఈసెట్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. తెలం గాణలోని హైదరాబాద్, ఏపీలో ని 94 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు.
అనంతపురం ఉన్నత విద్య, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ ఈసెట్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. తెలం గాణలోని హైదరాబాద్, ఏపీలో ని 94 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం 33,871 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 32,434 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 19,898 మందికిగాను 19,060 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 13,853 మందికిగాను 13,374 మంది హాజరయ్యారు. ఉదయం 95.78 శాతం, మధ్యాహ్నం 96.54 శాతం హాజరు నమోదైంది. మొత్తం 96.16 శాతం మంది విద్యార్థులు ఏపీఈసెట్ రాశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను ఏపీఈసెట్ చైర్మన్ సుదర్శనరావు పరిశీలించారు.