కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ హెచ్చరిక: సబిత
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:22 AM
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికవంటిదని మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికవంటిదని మాజీ మం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. గురువారం జిల్లెలగూడలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అధికార అహంకారం, రాజకీయ ప్రతీకారంతో లేనిపోని కేసులు పెడుతున్నదని, అలాంటి కేసుల విషయంలో కోర్టులు సరైన న్యాయం చేస్తాయనే నమ్మకం హైకోర్టు తీర్పుతో స్పష్టమయిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల సంక్షేమమే కాంక్షించారని, అన్నదాతల కోసమే కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులు కట్టించారని ఆమె పేర్కొన్నారు.
కోర్టు తీర్పుతో కేసీఆర్ తప్పు చేయలేదని స్పష్టమయిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సబితారెడ్డి అన్నారు. అంత పెద్ద ప్రాజెక్టును బలహీనపరచాలని ప్రభుత్వం చూస్తున్నదని, అలాంటి దురాలోచనను మానుకుని, ప్రాజెక్టులోని లోపాలను, దెబ్బతిన్న భాగాలను వెంటనే సరి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై చిల్లరమల్లర కేసులు పెట్టడం మానుకుని, ప్రజా సమస్యల పరిష్కారంపై, ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ బడంగ్‌పేట్ శాఖ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్‌పేట్ శాఖ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి, మీర్‌పేట్ కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ భూపాల్‌రెడ్డి, నాయకులు ఆనంద్‌రెడ్డి, అనిల్‌కుమార్, బి.శ్రీనివాసరాజు, రాజ్‌కుమార్, పెద్దబావి శ్రీనివా్‌సరెడ్డి, మాధవీవెంకటేశ్వరరావు, కర్రె బల్వంత్, గౌర శ్రీనివాస్, సంతోష్ కుమార్, కృష్ణారెడ్డి, దీప్‌లాల్, మహిపాల్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..
Read Latest Telangana News and National News