Share News

ఢిల్లీ హత్యాచారం కేసులో నిందితుడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..

ABN , Publish Date - Apr 24 , 2026 | 08:18 AM

రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యాచారం, హత్యాచారం కేసుల్లో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం.

ఢిల్లీ హత్యాచారం కేసులో నిందితుడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ..
Rahul Meena Arrest

న్యూఢిల్లీ: రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యాచారం, హత్యాచారం కేసుల్లో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడికి నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం. ఇద్దరిపై అత్యాచారం చేసి అందులో ఒకరిని హత్య చేసిన కేసుల్లో అతన్ని పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. ఆ సమయంలో పోలీసులకు చుక్కలు చూపించాడు నిందితుడు రాహుల్.


విచారణ సమయంలో నిందితుడు తన స్టేట్మెంట్‌ను పలుమార్లు మార్చి చెప్పినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. అనంతరం నాలుగు రోజుల కస్టడీ కోరుతూ ఢిల్లీ పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా 'నా వల్ల నేరం జరిగింది.. తప్పు జరిగిపోయింది' అంటూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీపికా థాకరన్ ఎదుట రాహుల్ మీనా నేరం ఒప్పుకున్నాడు. విచారణ అనంతరం నిందితుడిని నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది.


అసలు కేసు ఏంటి?

రాజస్థాన్‌లోని అల్వార్‌లో మంగళవారం రాత్రి తన స్నేహితుడి భార్యపై నిందితుడు రాహుల్ మీనా అత్యాచారం చేశాడు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఓ వ్యాన్‌ను రూ.6 వేల కిరాయికి మాట్లాడుకుని ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడికి చేరిన తర్వాత నగదు చెల్లించకుండానే పారిపోయాడు. గతంలో కైలాష్ హిల్స్‌ ప్రాంతంలో తాను పని చేసిన ఇంటి వద్దకు చేరుకున్నాడు. యజమాని, అతని భార్య జిమ్‌కి వెళ్లడంతో ఉదయం 6:30 గంటలకు ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న యజమాని కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెుబైల్ ఛార్జర్ వైర్‌తో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.


అనంతరం విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో అక్కడ పని చేసిన సమయంలో నగదు విషయంలో అవకతవకలకు పాల్పడడంతో అతన్ని పని నుంచి తీసేశారు యజమాని. దాన్ని మనసులో పెట్టుకుని ఈ దారుణానికి ఒడికట్టాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై అత్యాచారం చేసి అందులో ఒకరిని హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కస్టడీలో నిందితుడు ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడో వేచి చూడాల్సిందే.


ఈ వార్తలు కూడా చదవండి

భారత్‌, చైనా నరకాలు..!

సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది

Updated Date - Apr 24 , 2026 | 09:25 AM