ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ABN , Publish Date - Apr 24 , 2026 | 07:20 AM
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచిందంటూ సీఎం రేవంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోద్దని ఈ సందర్భంగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..