ఎకరా 51.25 కోట్లు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:29 AM
తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్‌నగర్‌లో ఎకరా ధర రూ.51.25 కోట్లు పలికింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ ...
ఉస్మాన్ నగర్‌లో భూమికి పలికిన ధర ఇదీ..
10.09 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రాజపుష్ప
టీజీఐఐసీ వేలంలో రూ.517 కోట్లతో దక్కించుకున్న సంస్థ
గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ నిర్మాణానికి ప్రణాళిక
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): తెల్లాపూర్ సమీపంలోని ఉస్మాన్‌నగర్‌లో ఎకరా ధర రూ.51.25 కోట్లు పలికింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ ఈ భూమిని దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 1లో సుమారు 10.09 ఎకరాల్లో సగటున ఎకరానికి రూ.51.25 కోట్ల ధరగా నమోదైంది. ఇది రిజర్వ్ ధర రూ.39 కోట్లతో పోలిస్తే 30శాతం కంటే ఎక్కువ ప్రీమియం కావడం గమనార్హం. అలాగే, ప్లాట్ నంబర్ 6(సుమారు 5.72 ఎకరాలు) కూడా ఒక్కో ఎకరానికి రూ.44 కోట్లు వరకు బిడ్లు పొందింది. మొత్తం ఆక్షన్‌లో సగటు ధర ఒక్కో ఎకరానికి రూ. 48.6 కోట్లు నమోదై మార్కెట్‌లో గట్టి పోటీని సూచించింది. ఈ రెండు ప్లాట్ల ద్వారా టీజీఐఐసీకి సుమారు రూ.769 కోట్ల ఆదాయం సమకూరినట్లయింది. ఈ ప్రాంతం ఓఆర్‌ఆర్, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్, కీలక ఐటీ హబ్‌లకు సమీపంలో ఉండటంతో ఈ స్థాయి పోటీ కనిపించింది.