Share News

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం

ABN , Publish Date - Apr 24 , 2026 | 06:48 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్న వేళ భారత్‌లో పసిడి, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం
Gold, Silver Rates on April 24

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలర్ బలపడుతుండటంతో బంగారం, వెండి ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఈ వారం మొదటి నుంచీ తిరోగమనంలోనే ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇప్పటివరకూ రూ.2,230ల మేర తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 24) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,53,540ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,740గా ఉంది. ఇక వెండి (కిలో) ధర రూ.2,69,900ల వద్ద కొనసాగుతోంది.


చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,470గా, ఢిల్లీలో రూ.1,53,690గా ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,53,540ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర చెన్నైలో రూ.1,41,590గా ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,40,740ల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,40,890గా ఉంది. కిలో వెండి ధర చెన్నైలో గరిష్ఠంగా రూ.2,69,900ల వద్ద కొనసాగుతుండగా, ముంబైలో అత్యల్పంగా రూ.2,59,900ల వద్ద ఉంది. భారత్‌లో నిన్న (ఏప్రిల్ 23) మేలిమి బంగారం ధర ఏకంగా రూ.1,200ల వేల మేర పడిపోయింది. 22 క్యారెట్ల పసిడి ధరలో కూడా రూ.1,100ల మేర కోత పడింది. కిలో వెండి ధర రూ.5 వేల మేర తగ్గింది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలూ చదవండి:

సత్తా చాటిన ఇన్ఫోసిస్‌.. క్యూ4లో గణనీయమైన లాభాలు

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.5,503 కోట్లు

Updated Date - Apr 24 , 2026 | 07:34 AM