Share News

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.5,503 కోట్లు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:24 AM

ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) మార్చి తైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఈ కాలానికి బ్యాంకు కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన...

యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.5,503 కోట్లు

ఒక్కో షేరుపై రూ.5 డివిడెండ్‌

ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) మార్చి తైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఈ కాలానికి బ్యాంకు కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.31,851.15 కోట్ల ఆదాయంపై రూ.5,503 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంకు నికర లాభం 9.8ు పెరిగింది. అనుబంధ సంస్థల లాభాలను తీసివేస్తే మాత్రం బ్యాంకు నికర లాభం 6.6ు వృద్ధితో రూ.5,316 కోట్లకు చేరింది. అయితే ఇదే సమయంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 1.14ు తగ్గి రూ.9,406 కోట్లకు చేరింది. దీంతో నికర వడ్డీ లాభ శాతం (ఎన్‌ఐఎం) 2.87 నుంచి 2.64 శాతానికి పడిపోయింది. రుణ వితరణ వృద్ధిరేటు 10ు మించలేదు. అయినా వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.5 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని యూబీఐ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

ఈ ఏడాది రూ.55,000 కోట్ల రుణాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) కంపెనీలకు ఇచ్చే రుణాలు రూ.55,000 కోట్లకు చేరే అవకాశం ఉందని యూబీఐ ఎండీ, సీఈఓ అశీశ్‌ పాండే చెప్పారు. ఇందులో ఇప్పటికే రూ.30,000 కోట్ల రుణాలను అనుమతించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:24 AM