Share News

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

ABN , Publish Date - Apr 23 , 2026 | 02:46 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం దశాబ్దాలుగా ఉంది. అమెరికా సహాయంతో ఇరాన్‌పై దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారని అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జాన్ కెర్రీ వెల్లడించారు.

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి
Netanyahu Iran war plan

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం దశాబ్దాలుగా ఉంది. అమెరికా సహాయంతో ఇరాన్‌పై దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారని అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జాన్ కెర్రీ వెల్లడించారు. ఇరాన్‌పై యుద్ధం చేయాలనే ప్రతిపాదనను నెతన్యాహు ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుల ముందు పలుసార్లు పెట్టారని జాన్ కెర్రీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్, బైడెన్ తిరస్కరించారని తెలిపారు (Netanyahu Iran war plan).


జాన్ కెర్రీ ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ఒబామా వద్దన్నారు. బుష్ వద్దన్నారు. అధ్యక్షుడు బైడెన్ వద్దన్నారు. నేను కూడా ఆ సంభాషణలలో భాగమయ్యాను' అని చెప్పారు. నెతన్యాహు చాలా కాలంగా ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాను ఒత్తిడి చేస్తున్నారని కెర్రీ చెప్పారు. కానీ గత అధ్యక్షులు దౌత్యపరమైన పరిష్కారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలిపారు. ట్రంప్ మాత్రం నెతన్యాహు మాటలు విని యుద్ధానికి దిగారని అన్నారు (John Kerry statement Iran war).


వియత్నాం, ఇరాక్ యుద్ధాలు రెండూ ఒకే పాఠాన్ని నేర్పుతున్నాయని, వియత్నాం యుద్ధ వీరుడిగా తనకు ఆ పాఠం తెలుసని కెర్రీ పేర్కొన్నారు. 'వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక అనుభవజ్ఞుడిగా చెబుతున్నాను. దేని గురించి ఆ యుద్ధం చేయాలో మాకు చెప్పలేదు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. ముందు అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పి.. ఆ తర్వాత వారి కొడుకులను, కూతుళ్లను యుద్ధానికి పంపమని అడగవద్దు' అని కెర్రీ పేర్కొన్నారు (Trump Iran war decision).


ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడి చేసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నెతన్యాహు ఎలా ఒప్పించారో న్యూయార్క్ టైమ్స్ వివరించింది (US Israel Iran relations). 'ఫిబ్రవరి 11న సిట్యుయేషన్ రూమ్‌లో, నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్‌లో పాలన మార్పునకు సమయం ఆసన్నమైందని అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త మిషన్ ముగింపు పలకగలదని నెతన్యాహు గట్టిగా వాదించారు' అని ఆ నివేదిక పేర్కొంది. 'ఇది మంచి ఆలోచనగానే అనిపిస్తోంది' అంటూ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌కు ట్రంప్ పచ్చజెండా ఊపారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌లో సీమైన్స్‌‌ను తొలగించేందుకు 6 నెలల పట్టవచ్చు: పెంటగాన్

మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు: ఇరాన్‌ హెచ్చరిక

Updated Date - Apr 23 , 2026 | 02:49 PM