Share News

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:14 PM

ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలను త్వరగా పున:ప్రారంభించాలనే ఒత్తిడి తనపై లేదన్నారు.

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
Trump Iran talks no time pressure

ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలను త్వరగా పున:ప్రారంభించాలనే ఒత్తిడి తనపై లేదన్నారు. ఇరాన్‌తో కచ్చితంగా, త్వరగా ఒప్పందం చేసుకోవాలనే ఒత్తిడి తనపై లేదని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు (Trump on Iran talks).


ఇరాన్‌తో శాంతి చర్చల విషయంలో త్వరపడటం కంటే సరైన ఒప్పందం కుదుర్చుకోవడం ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. 'మేము తీసుకునే నిర్ణయం గత ఒప్పందాల కంటే మెరుగ్గా ఉండాలి' అని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ ఘర్షణలను తాను త్వరగా ముగించాలనుకుంటున్నానని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. అమెరికా ప్రజల భవిష్యత్తు కోసం ఓ మంచి ఒప్పందం కుదుర్చుకోవడం పైనే తమ ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందన్నారు (US Iran ceasefire news).


హోర్ముజ్ జలసంధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటన గురించి కూడా ట్రంప్ మాట్లాడారు (Iran peace talks update). బుధవారం ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలు అమెరికావి కావన్నారు. హోర్ముజ్ జలసంధిలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమెరికా అమలు చేస్తున్న నౌకా దిగ్బంధనం వల్ల ఇరాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, బాంబుల దాడి కంటే దీని గురించే ఆ దేశ నాయకులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. నౌకా దిగ్బంధనం వల్ల ఇరాన్ చమురు బావులు శాశ్వతంగా మూత పడాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌లో సీమైన్స్‌‌ను తొలగించేందుకు 6 నెలల పట్టవచ్చు: పెంటగాన్

మా ఓడరేవుల దిగ్బంధనం ఆపకపోతే దాడి తప్పదు: ఇరాన్‌ హెచ్చరిక

Updated Date - Apr 23 , 2026 | 03:14 PM