ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:59 AM
ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దని.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలని సూచించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దని.. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపాలన్నారు. ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడం వల్ల అభ్యంతరం లేదని.. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని మంత్రి తెలిపారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఘటనలు జరుగుతున్నాయని... నేతలు సంయమనం పాటించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ
శంకర్ గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు
Read Latest Telangana News And Telugu News