Share News

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ

ABN , Publish Date - Apr 24 , 2026 | 08:48 AM

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ
YCP MLC Anantha Babu

రాజమండ్రి, ఏప్రిల్ 24: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలను వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అతిక్రమించారంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడి బెయిల్ రద్దు చేయాలంటూ రాజమండ్రి జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది.


మరో వైపు ఈ హత్య కేసులో సాక్షులను భయపెట్టడమే కాకుండా వారిని ప్రలోభ పెట్టడం ద్వారా తప్పుడు సాక్ష్యం చెప్పే విధంగా బెదిరించినట్లు అనంతబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జయమంగళం రాజీనామాను తిరస్కరించిన మండలి చైర్మన్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..

For More AP News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 09:06 AM